ప్రముఖ స్టార్ కొడుకు ప్రేమలో పూజా హెగ్డే… ఇంతకీ ఎవరా హీరో…!

సినిమా ఇండస్ట్రీలో బిజీగా ఉన్నామని చెప్పే స్టార్ స్టార్ హీరోయిన్లు కూడా ప్రేమలో పడిపోతూ ఉంటారు.  ఆ లిస్ట్ లో ఇప్పుడు పూజా హెగ్డే కూడా చేరిపోయింది.  వరుణ్ తేజ్ తో ముకుందా సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన పూజ, డీజే సినిమాతో పాపులర్ అయ్యింది.  అరవింద సమేత సినిమాతో స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న ఈ భామ,

ఆ తరువాత మహేష్ బాబుతో మహర్షి చేసి మెప్పించింది.  వరుణ్ తేజ్ గద్దలకొండ గణేష్ సినిమాలో ఓ లీడ్ పాత్ర చేసింది.  ఇటు అల్లు అర్జున్ తో చేసిన అల వైకుంఠపురంలో సినిమాకు కూడా మంచి టాక్ రావడంతో టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా, గోల్డెన్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. 

అయితే, ఈ భామ ఇప్పుడు ప్రేమలో పడినట్టుగా తెలుస్తోంది.  బజార్ సినిమా స్టార్ వినోద్ మెహ్రా కుమారుడు రోహన్ మెహ్రాతో ప్రేమలో పడినట్టు తెలుస్తోంది.  ఇద్దరు ప్రస్తుతం డేటింగ్ లో ఉన్నారని బాలీవుడ్ మీడియా కోడై కూస్తున్నది.  ఇదికూడా ఒక రకంగా పబ్లిసిటీ అని చెప్పాలి.  మరి ఈ ప్రేమ వ్యవహారం ఎంతవరకు ఉంటుందో చూడాలి.