సరిలేరు నీకెవ్వరు & అల వైకుంఠపురములో ఫస్ట్ డే కలెక్షన్స్:

ఈ సంక్రాంతికి టాలీవుడ్‌లో రెండు బడా చిత్రాలు విడుదలైన సంగతి తెలిసిందే. ఒకటి సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ అయితే.. మరొకటి బన్నీ ‘అల.. వైకుంఠపురములో’. రెండు సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్స్ అందుకున్నాయి. ఇదిలా ఉంటే ఓవర్సీస్‌లో అల్లు అర్జున్ కంటే మహేష్ హవానే ఎక్కువన్న సంగతి అందరికి తెలిసిందే. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఈ రెండు సినిమా రికార్డు స్థాయిలో కలెక్షన్స్ రాబట్టాయి . ఇప్పటిదాకా అందిన రిపోర్ట్స్ ప్రకారం

సరిలేరు నీకెవ్వరు ఫస్ట్ డే కలెక్షన్స్ : ఇక ప్రపంచవ్యాప్తంగా చూస్తే ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా 47 కోట్లు రాబట్టినట్లు రిపోర్ట్స్ చెబుతున్నాయి.గుంటూరు, కృష్ణ, నెల్లూరు జిల్లాల్లో సాలిడ్ కలెక్షన్లు రాబట్టి మహేష్ పట్టుబిగించినట్లు తెలుస్తోంది. నెల్లూరులో ఈ సినిమా 1,27,09,211 రాబట్టి.. అక్కడ తొలిరోజు మహేష్ కెరీర్‌లో బెస్ట్ కలెక్షన్ రికార్డు సొంతం చేసుకుంది. కృష్ణా జిల్లాలోనూ ఇదే పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా ఓవర్సీస్ మార్కెట్‌లో దుమ్ముదులిపేసింది ఈ మూవీ. అమెరికాలో 294 సెంటర్లలో విడుదలైన ఈ సినిమా 759,973 డాలర్స్ రాబట్టినట్లు సినీ విశ్లేషకులు తరుణ్ ఆదర్శ్ వెల్లడించారు.

అల.. వైకుంఠపురములో ఫస్ట్ డే కలెక్షన్స్ : ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం రూ. 45 కోట్లు గ్రాస్ రాబట్టినట్టు మార్కెట్ అనలిస్ట్‌లు లెక్కలు కట్టారు. అధికారిక లెక్కలు రావాల్సి ఉండగా.. షేర్ రూ. 30 కోట్లు రాబట్టిందని అంచనా.రెండు తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే.. తొలి రోజు ఏపీ, తెలంగాణలలో దాదాపు రూ. 20 కోట్లు, ఓవర్సీస్‌లో 5 కోట్లు, కేరళ, కర్ణాటక ఇతర రాష్ట్రాల్లో మూడున్నర కోట్లుపైగానే వసూలు చేసినట్టు తెలుస్తోంది. ఇక ఏరియాల వారిగా.. నైజాంలో 5 కోట్లు, సీడెడ్‌లో 2.5 కోట్లు, ఉత్తరాంధ్రలో 2 కోట్లు, ఈస్ట్-వెస్ట్‌లలో కలిపి 4.5 కోట్లు, గుంటూరు 3 కోట్లు, క్రిష్ణా నెల్లూరు జిల్లాలలో దాదాపు 3 కోట్లు రాబట్టినట్టు ట్రేడ్ నిపుణుల అంచనా.