పృథ్వి రాజ్ SVBC చైర్మన్ పదవికి రాజీనామా

పృథ్వీ ఆడియో వ్యవహారంపై టీటీడీ సీరియస్‌ అయ్యింది. టీటీడీ విజిలెన్స్‌ కూడా విచారణ చేపట్టింది. ఎస్వీబీసీ కార్యాలయంలో ఆయనను విచారించి.. పలువురు సిబ్బంది నుంచి వివరాలు సేకరించింది. ఇదే వ్యవహారంపై టీటీడీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి ఆరా తీశారు. పృథ్వీతో ప్రత్యేకంగా మాట్లాడారు. విజిలెన్స్‌ నివేదిక వచ్చిన తర్వాత చర్యలు తీసుకుంటామని.. స్పష్టం చేశారు. అయితే విషయం సీరియస్‌ కావడంతో పదవి నుంచి తప్పుకోవాలని టీటీడీ సూచించింది. దీంతో పృథ్వీరాజ్‌ తన పదవికి రాజీనామా చేశారు.