నిన్న మ్యాచ్ లో విరాట్ కోహ్లీ స్టన్నింగ్ క్యాచ్ వీడియో : వారెవ్వా క్యాచ్‌ అంటూ స్టేడియం లో

ఆదివారం వెస్టిండీస్‌తో జరిగిన రెండో టి20లో అతడు పట్టిన కళ్లు చెదిరే క్యాచ్‌ చూస్తే ఎవరైనా ఈ మాట ఒప్పుకోవాల్సిందే. ఇన్నింగ్స్‌ 14వ ఓవర్లో హెట్‌మైర్‌ 2 వరుస సిక్సర్లు బాదేశాడు. మరుసటి బంతికీ భారీ షాట్‌నే బాదాడు. లాంగాన్‌లో ఉన్న కోహ్లి మెరుపు వేగంతో పరుగెత్తుకుంటూ వచ్చి బౌండరీ దగ్గర అద్భుతంగా క్యాచ్‌ను అందుకున్నాడు. . అసాధారణ వేగాన్ని నియంత్రించుకొని… బౌండరీ లైన్‌కు తగిలే సమయంలో చేతిని తాకకుండా చేయడం అన్నీ కళ్లు మూసి తెరిచేలోపే జరిగిపోయాయి. వారెవ్వా క్యాచ్‌ అంటూ స్టేడియం చప్పట్లతో మోగిపోయింది.