ప్రియాంక ను ఎలా చంపారో నా కొడుకును కూడా అలాగే చంపేయండి :చెన్నకేశవులు తల్లి

నవంబర్ 27 వ తేదీ రాత్రి ప్రియాంక రెడ్డిని అత్యంత కిరాతకంగా అత్యాచారం చేసి హత్య చేసిన నలుగురు నిందితులు ప్రస్తుతం షాద్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఉన్నారు.  నలుగురు నిందితులలోని ఒక వ్యక్తి చెన్నకేశవులు తల్లి ఈ విషయంపై స్పందించారు.  ఒకవేళ తన కొడుకు ఈ తప్పు చేశారని తేలితే..తన కొడుకుకు ఉరేసినా పర్వాలేదని అంటున్నారు.  అవసరమైతే ప్రియాంక రెడ్డిని ఎలాగైతే చంపారు అలా చంపేయండి అని అంటున్నారు.  తనకు ఆడపిల్లలు ఉన్నారని, మరొకరికి ఇలాంటిది జరగకూడదని నిందితుడు చెన్నకేశవులు తల్లి పేర్కొన్నది.