Breaking News :ప్రియాంక రెడ్డి హత్య మరువక ముందే శంషాబాద్ లో మరో మహిళ సజీవ దహనం

ప్రియాంక రెడ్డి హత్య మరువక ముందే మరో మహిళ దారుణ హత్య… శంషాబాద్ లో మరో మహిళా సజీవ దహనం .సిద్దుల గుట్ట ప్రాంతంలో ఓ మహిళను సజీవ దహనం చేశారు గుర్తు తెలియని వ్యక్తులు. ఇక్కడి శివారుని నిర్మానుష్య ప్రాంతంలో కాలిపోయిన మహిళ శవం దొరికింది.సంఘటనా స్థలం సమీపంలో ఉన్న సిద్ధులగుట్ట దేవాలయంలో పూజ చేసుకోవడానికి వెళ్తున్న అయ్యప్ప భక్తులు గమనించి.. పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు, క్లూస్ టీమ్ అక్కడికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. శుక్రవారం రాత్రి దాదాపు 6 నుంచి 7 గంటల మధ్య ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు పోలీసులు.ఇది హత్యా? లేక ఆత్మహత్యా? అన్న కోణంలో పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. మృతురాలి చెప్పులు, బట్టలను క్లూస్ టీమ్ స్వాధీనం చేసుకుంది.. అత్యాచారం చేసి, హత్య చేశారా అన్న కోణంలోనూ అనుమానం వ్యక్తం చేస్తున్నారు.బాదితురాలు ఎవరన్న సమాచారం ఇంకా తెలియలేదు. ఆమె వయసు 35 ఏళ్లు ఉండొచ్చని తెలుస్తోంది.