నిఖిల్ అర్జున్‌ సురవరం రివ్యూ ఫస్ట్ టాక్ – అర్జున్ సురవరం’ కథేంటి?

నిఖిల్ అర్జున్‌ సురవరం రివ్యూ ఫస్ట్ టాక్..డిఫరెంట్ చిత్రాలతో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న నిఖిల్..  ఈ మధ్యకాలంలో బాగా వెనకబడ్డారు. ఆయన నటించిన..అర్జున్ సురవరం రోజు (నవంబర్ 29న) సినిమా విడుదల కానున్న నేపథ్యంలో ఇప్పటికే ప్రీమియర్స్ ప్రదర్శించబడ్డాయి. రిలీజ్ విషయంలో ఎన్నో ఇబ్బందులు పడ్డ అర్జున్ సురవరం ఫైనల్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా అసలు టాక్ ఏంటన్నది తెలియాలంటే సాయంత్రం వరకు వెయిట్ చేయాల్సిందే. రిలీజ్ వరకు ఎలాంటి బజ్ లేని ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు మెగాస్టార్ చిరంజీవి రావడం మెగా ఫ్యాన్స్ లో ఈ సినిమాపై ఆసక్తి పెరిగింది.

అర్జున్‌ సురవరం :: టాక్ ఫేక్ డిగ్రీ సర్టిఫికెట్ల స్కామ్ నేపథ్యంలో తమిళంలో తెరకెక్కిన కనితన్ మూవీ అక్కడ బాగా హిట్ అయింది. ఇప్పుడిదే సినిమాని తెలుగులో అర్జున్ సురవంగా  రీమేక్ చేసారు.  .ఠాగూర్’ మ‌ధు స‌మ‌ర్పణ‌లో మూవీ డైన‌మిక్స్ ఎల్ఎల్‌పి బ్యాన‌ర్‌పై రాజ్‌ కుమార్ ఆకెళ్ల నిర్మాతగా రూపొందిన ఈ సినిమాలో నిఖిల్ సిద్ధార్థ సరసన లావణ్య త్రిపాఠి నటించింది.

అర్జున్ సురవరం’ కథేంటి? ‘‘లావణ్య, వెన్నెల కిషోర్, సత్య, నేను ఒక యంగ్ టీమ్. ఈ నలుగురు టీమ్ సభ్యులు ఒక సమస్యలో పడతారు. ఆ సమస్య నుంచి వాళ్లు ఎలా బయటపడగలిగారు అనేది ముఖ్య కథ. అలాగే మంచి సోషల్ మెసేజ్ ఉన్న చిత్రం ఇది. కొందరి చర్యల వలన గ్రాడ్యుయేట్స్, వారిపై ఆధారపడ్డ తల్లిదండ్రులు ఎలా సఫర్ అవుతున్నారు అనే విషయాలు ఈ చిత్రంలో చెప్పడం జరిగింది..’’ అని నిఖిల్ తెలిపారు. మరి అర్జున్ సురవరం ప్రేక్షకులను ఏ రేంజ్ లో అలరించాడు అన్నది తెలుగు రాష్ట్రాల్లో మొదటి ఆట పడితేనే కాని తెలియదు.