మట్టి కుండలో మజ్జిగన్నం నా Next సినిమా – ప్రెస్ మీట్ లో ఆర్జీవీ వెల్లడి

కమ్మరాజ్యంలో కడప రెడ్లు’ సినిమా ఏపీ రాజకీయాల చుట్టూ తిరుగుతున్న విషయం తెలిసిందే. ప్రధాన పార్టీల నేతలను, వారి హావభావాలను ఆర్జీవీ తన సినిమాలో చూపించబోతున్నాడు. ఈ చిత్రంలో ఓ పాత్ర జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను గుర్తు చేస్తుండటంపై పవన్ అభిమానులు, జనసేన కార్యకర్తలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. మీడియా సమావేశంలో దీనిపై ఆర్జీవీని ప్రశ్నించగా.. సినిమాలో జనసేన లేదని.. అది మనసేన పార్టీ అని చెప్పుకొచ్చారు. ఈ సినిమాలో చూపించిన మనసేనకు, జనసేనకు సంబంధం లేదన్నారు. అలాగే మట్టి కుండలో మజ్జిగన్నం నా Next సినిమా తీస్తున్నా అని ప్రెస్ మీట్ లో వెల్లడించాడు,
చివరిగా చెప్పేది ఏంటంటే.. మీతోడు.. ఇది పొలిటికల్ సెటైర్ మాత్రమే. కొంతమంది ఫేమస్ వ్యక్తులను పోలి ఉండటం యాదృచ్ఛికం మాత్రమే. ఏదైనా తప్పుంటే దేవుడు నన్ను శిక్షించుగాక’’ అంటూ తనదైన శైలిలో ముగించారు.