బస్టాండులో చేయకూడని పని చేసారు,సిగ్గుతో తలదించుకున్న జనం!

పట్టపగలు పదిమంది వచ్చిపోయే బస్టాండులో అశ్లీల వీడియో దర్శనమిచ్చింది దీంతో అక్కడి జనం సిగ్గుతో తలదించుకున్న సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.భోపాల్ రాష్ట్రంలోని విద్యానగర్ అనే ప్రాంతంలోని బస్టాండ్‌లో ఉన్న టికెట్ వెండింగ్ మిషన్‌ స్క్రీన్‌పై ఒక్కసారిగా శృంగార వీడియో ఒకటి ప్రత్యక్షమయ్యింది. అది చూసిన జనం ఒక్కసారిగా అవాక్కయ్యారు.బస్టాండ్‌లో ఇలాంటి వీడియోలు ఏమిటి అంటూ ముక్కున వేలేసుకున్నారు. దాన్ని నిలిపేయడం సాధ్యం కాక పారిపోయారు. ఓ యువకుడు ఆ తతంగాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పడేశారు. దీనిపై సైబర్ సెల్‌ అధికారులకు ఫిర్యాదు చేశాం. ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోంది.— భోపాల్ మున్సిపల్ కార్పోరేషన్ & భోపాల్ సిటీ లింక్ లిమిటెడ్(BCCL) బస్టాండ్‌లో ఇలాంటి ఘటన చోటు చేసుకోవడాన్ని తాము తీవ్రంగా పరిగణిస్తున్నామని భోపాల్ మేయర్ అలోక్ శర్మ అన్నారు. దీనిపై వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సిందిగా పోలీసులను కోరినట్టు తెలిపారు. ఆ ఘటనకు బాధ్యులైనవారిని పోలీసులు త్వరలోనే పట్టుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు.