కమ్మరాజ్యంలో కడప రెడ్లు’ సినిమా టైటిల్‌ మార్చిన వర్మ..ఈ‌ సారి ఏం టైటిల్ పెట్టాడో తెలుసా?

వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రస్తుతం ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ సినిమాతో రానున్నాడు. ఇప్పటికే ఈ సినిమా టైటిల్, సన్నివేశాల విషయంలో పలు ఆరోపణలు చోటు చేసుకున్న సంగతి విదితమే. ఈ క్రమంలోనే టీవీ9 బిగ్ న్యూస్ బిగ్ డిబేట్‌కు ప్రత్యేక అతిధిగా విచ్చేసిన వర్మ.. సినిమా టైటిల్‌ను సడన్‌గా మార్చేశారు. ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ అనే టైటిల్‌ను ‘అమ్మరాజ్యంలో కడప బిడ్డలు‘ అని మార్చారు.ఈ సినిమా టైటిల్‌పై పలు వివాదాలు చెలరేగడమే కాకుండా.. కేఏపాల్ కూడా తనను కించపరిచేలా ఉందని ఫిర్యాదు చేయడంతోనే టైటిల్ మార్చానని రామ్ గోపాల్ వర్మ చెప్పుకొచ్చారు. కాగా, ఈ సినిమా ఈ నెల 29న విడుదల కానుండగా.. ఏపీలో మాత్రం ఈ సినిమా అనుకున్న సమయానికి రిలీజ్ అవుతుందో లేదో వేచి చూడాలి.