ఇద్దరు పిల్లలున్నా.. భార్యకు మరో పెళ్లి చేసిన భర్త …ఎందుకో తెలుసా ?

భోపాల్‌కి చెందిన మహేష్‌కి, సంగీతతో 7 సంవత్సరాల క్రితం పెళ్లైంది. వారికి ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు. ఇప్పుడు మహేష్, సంగీతలు తమకు విడాకులు కావాలంటూ ఫ్యామిలీ కోర్టును సంప్రదించారు. విడాకులు ఎందుకో తెలుసా.. తన భార్యను ఆమె ప్రేమించిన వాడికిచ్చి వివాహం చేయాలని మహేష్ అనుకోవడమే దీనికి కారణం.పెళ్లికి ముందు సంగీత ఒక వ్యక్తిని ప్రేమించింది. వారి ప్రేమకు ఆమె తండ్రి ఒప్పుకోలేదు. అందుకే సంగీతను వెంటనే మహేష్‌కిచ్చి పెళ్లి చేశాడు. కొన్ని సంవత్సరాల తర్వాత సంగీతకు ఒక విషయం తెలిసింది. ఆమె ప్రేమించిన వ్యక్తి.. ఆమె మీద ఉన్న ప్రేమతో ఇప్పటికీ ఎవరినీ వివాహం చేసుకోలేదని.

అది తెలిసిన సంగీత.. తన భర్తకు విడాకులిచ్చి.. ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకోవాలని అనుకుంది. దీనికి ఆమె భర్త కూడా ఒప్పుకున్నాడు. అందుకే వారిద్దరూ కలిసి విడాకుల కోసం ఫ్యామిలీ కోర్టుకు వచ్చారు. అయితే వీళ్లు తీసుకునే విడాకులు.. వారి పిల్లల భవిష్యత్ మీద ప్రభావం చూపుతాయని కోర్టు భావించి తీర్పును వాయిదా వేసింది. వారిద్దరూ ఒప్పుకున్నారు కాబట్టి కోర్టు తర్వాతి విచారణలో వారికి కోర్టు విడాకులు మంజూరు చేస్తుందని వారి తరపు కౌన్సిలర్ తెలిపాడు. మహేష్ తన భార్యకు లవర్‌ని పెళ్లి చేసుకున్నా మరో బంపర్ ఆఫర్ కూడా ఇచ్చాడు. అదేంటంటే.. సంగీతకు ఎప్పుడు పిల్లల్ని చూడాలని అనిపించినా వెంటనే ఇంటికి వచ్చి చూడొచ్చని కూడా ఆమెకు చెప్పాడు. ఇదంతా చూసి.. మహేష్ ఎంత గొప్ప మనసున్న వాడో అని అందరూ పొగుడుతున్నారు.