ట్యాంక్ బండ్ పై ఈ రోజు ఉదయం రోడ్డు ప్రమాదం

గచ్చిబౌలిలోని బయోడైవర్సిటీ వద్ద ప్రమాద ఘటన జరిగిన మరుసటి రోజే ట్యాంక్‌ బండ్‌పై  మరో ప్రమాదం జరిగింది. ట్యాంక్ బండ్‌పై ఇద్దరు యువకులు బైక్‌ని రాంగ్ రూట్‌లో నడుపుతూ… రోడ్డు క్రాస్ చెయ్యబోయారు.ఐతే… ఎదురుగా అత్యంత వేగంతో వస్తున్న మరో బైక్… ఈ బైక్‌ను బలంగా ఢీకొట్టింది.రెండు బైకులూ తుక్కుతుక్కయ్యాయి. మొత్తం నలుగురు కుర్రాళ్లు… చెల్లా చెదురుగా ఎగిరిపడ్డారు.ఒక్కసారిగా ఆ ప్రాంతం అల్లకల్లోలంగా మారిపోయింది. బైక్ నుంచీ నిప్పురవ్వలు వచ్చాయి.తీవ్ర గాయాలైన ఆ నలుగురినీ… వెంటనే స్థానిక ఆస్పత్రిలో చేర్చారు.