హైదరాబాద్ లో సినిమా సీన్ ను మించిపోయిన కారు ప్రమాదం: ప్లై ఓవర్‌పై నుంచి కింద పడింది

హైదరాబాద్‌లో కారు బీభత్సం సృష్టించింది. అతివేగంగా వచ్చిన కారు డివైడర్‌ను ఢీ కొట్టి. బయో డైవర్సిటీ ప్లైఓవర్‌పై నుంచి కింద పడింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. అదే టైంలో ప్లైఓవర్‌ కింద ఉన్న మరో కారుపై పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులకు తీవ్రగాయాలయ్యాయి. అదేవిధంగా ఆటో కోసం ఎదురు చూస్తున్న మహిళపై కారుపడటంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. వెంటనే స్పందించిన స్ధానికులు పోలీసులకు సమాచారం అందజేసి ఆరుగురిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు.

పోలీసుల కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బయోడైవర్సిటీ వద్ద ఇటీవలే ఓపెన్‌ చేసిన ఫ్లైఓవర్ పై నెల కూడా గడవక ముందే వరుస ప్రమాదాలు జరగడం కలకలం రేపుతున్నాయి. ఫ్లైఓవర్‌ డిజైన్‌లో లోపం ఉందని, ఎన్నోమలుపులు ఉండటంతో ఇలా ప్రమాదాలు జరుగుతున్నాయని ఆరోపణలు వస్తున్నాయి. కాస్త స్పీడ్ ఎక్కువైనా సరే ఫ్లైఓవర్‌పై స్పీడ్‌ను కంట్రోల్ చేయటం కష్టంగా ఉంటుందని ప్రయాణికులు అంటున్నారు.