“ముఖేష్ అంబానీ” ని పెళ్లి చేసుకోవడానికి “నీతూ అంబానీ” పెట్టిన కండిషన్ ఏంటో తెలుసా.? ఒప్పుకున్న తర్వాతే పెళ్లి.!

ముఖేష్ అంబానీ.. రిల‌య‌న్స్ ఇండ‌స్ట్రీస్ చైర్మ‌న్.. ఈ మ‌ధ్యే త‌న త‌మ్ముడు అనిల్ అంబానీకి చెందిన ఆర్‌కామ్ సంస్థ‌ను రూ.23వేల కోట్ల డీల్‌కు టేకోవ‌ర్ చేశాడు. కేవ‌లం ఇదే కాదు, ఇలా ముఖేష్ అంబానీ టేకోవ‌ర్ చేసిన ఎన్నో కంపెనీలు ఉన్నాయి. ఈ క్ర‌మంలోనే ముఖేష్ అంబానీ ఒక విజ‌య‌వంత‌మైన పారిశ్రామిక వేత్త‌గా దూసుకుపోతున్నారు. త‌న తండ్రి ధీరూభాయ్ అంబానీ క‌ల‌ల‌ను నిజం చేస్తున్నాడు. అయితే ప్ర‌తి మ‌గ‌వాడి విజ‌యం వెనుక ఓ స్త్రీ ఉన్న‌ట్టు గానే ముఖేష్ అంబానీ స‌క్సెస్ వెనుక కూడా ఓ స్త్రీ ఉంది. ఆమె మ‌రెవ‌రో కాదు, ఆయ‌న భార్య నీతా అంబానీయే. వీరిద్ద‌రి పెళ్లికి సంబంధించిన ఓ ముఖ్య‌మైన విష‌యాన్ని ఇప్పుడు తెలుసుకుందాం

ముఖేష్, నీతా అంబానీల‌ది అరేంజ్డ్ మ్యారేజ్‌. పెద్ద‌లు కుదిర్చిన వివాహం. అయితే ఈ సంబంధాన్ని మొద‌ట చూసింది మాత్రం ముఖేష్ త‌ల్లి కోకిలాబెన్ అంబానీయే. ఆమె నీతాను ఓ డ్యాన్స్ పెర్ఫార్మెన్స్‌లో చూసింది. ఎందుకంటే నీతా అంబానీ ఓ చ‌క్క‌ని డ్యాన్స‌ర్‌. ఆమె ఇచ్చిన ఓ ప్ర‌ద‌ర్శ‌న‌లో ఆమె నృత్యానికి కోకిలా బెన్ ఆక‌ర్షిత‌మైన ఆమెను త‌న కోడ‌ల్ని చేసుకోవాల‌నుకుంది. అనుకున్న వెంట‌నే వెళ్లి నీతాతో మాట్లాడి సంబంధాన్ని ఫిక్స్ చేసింది. అయితే త‌ల్లి చూసిన సంబంధాన్ని ముఖేష్ కూడా కాద‌న‌లేదు. ఈ క్ర‌మంలోనే ముఖేష్, నీతాల మ‌ధ్య పెళ్లికి ముందు ప్రేమ చిగురించింది.

అయితే నీతా అప్పుడు ఓ ప్రైవేటు స్కూల్‌లో నెల‌కు రూ.800 జీతానికి ప‌నిచేసేది. ఈ క్ర‌మంలో ఆమె రోజూ బ‌స్‌లో వెళ్లేది. దీంతో ఆమె వెంట వెళ్లేందుకు ముఖేష్ కారును కూడా విడిచి పెట్టేవాడ‌ట‌. ఆమెతో బ‌స్‌లో వెళ్లేవాడ‌ట‌. అయితే పెళ్లికి ముందు నీతా ముఖేష్ అంబానీకి ఓ కండిష‌న్ పెట్టింది. అదేమిటంటే… తాను ప్రైవేట్ స్కూల్‌లో టీచ‌ర్‌ను అని, పెళ్ల‌య్యాక కూడా టీచ‌ర్‌గా కొన‌సాగుతాన‌ని, అందుకు అడ్డు చెప్పకూడ‌ద‌ని ఆమె కండిష‌న్ పెట్టింది. ఇందుకు ముఖేష్ కూడా ఒప్పుకోవ‌డంతో వారికి వివాహం జ‌రిగింది. అయితే ముఖేష్ తో వివాహం అయ్యాక నీతా అంబానీకి ఒక విచిత్ర‌మైన సంఘ‌ట‌న ఎదురైంది. అదేమిటంటే…

అప్పుడు 1987. ఇండియాలో క్రికెట్ వ‌ర‌ల్డ్ క‌ప్ జ‌రుగుతోంది. ఆ టోర్న‌మెంట్‌లో ఇండియా ఆడుతున్న ఓ మ్యాచ్ కోసం నీతా ప‌నిచేస్తున్న స్కూల్‌కు చెందిన ఓ విద్యార్థి త‌ల్లిదండ్రులు టిక్కెట్ల‌ను కొన్నారు. వాటిలో ఒక టికెట్‌ను నీతాకు ఇచ్చి ఆమెను మ్యాచ్‌కు ర‌మ్మ‌న్నారు. కానీ నీతా అందుకు ఒప్పుకోలేదు. తిర‌స్క‌రించింది. అయితే మ్యాచ్ కోసం స్టేడియం వ‌చ్చిన ఆ పేరెంట్స్ నీతాను వీఐపీ బాక్స్‌లో చూసి షాక‌య్యారు. ఎందుకంటే అప్పుడు ఆమె రిల‌య‌న్స్ అంబానీల కోడ‌లు క‌దా. అలాంటిది స్కూల్‌లో టీచ‌ర్‌గా ప‌నిచేస్తుంద‌ని తెలిసి ఆ పేరెంట్స్ ఖంగు తిన్నారు. అయితే త‌రువాత ఇలాంటి ఘ‌ట‌న‌లు మ‌ళ్లీ చోటు చేసుకోలేదు. ఎందుకంటే ఆమె టీచ‌ర్ జాబ్ వ‌దిలి రిల‌య‌న్స్ వ్యాపారాల‌ను చూసుకుంది.