సైరా సినిమా తెచ్చిన తంటా..ఆరుగురు ఎస్సైల పై వేటు వేసిన ఎస్పీ… ఎందుకో తెలుసా ?

By | October 3, 2019

మెగాస్టార్‌ చిరంజీవి నటించిన ‘సైరా’సినిమా ఇవాళ దేశవ్యాప్తంగా విడుదలయ్యింది. అక్టోబర్ 2న గాంధీజయంతి సందర్బంగా ఈ సినిమాను విడుదల చేశారు. అయితే చిరంజీవి అభిమానులంతా అర్థరాత్రి నుంచే థియేటర్లకు క్యూ కట్టారు. అయితే ఏపీలో కొందరు పోలీసులు కూడా చిరు సినిమా కోసం పడిగాపులు పడ్డారు. కర్నూలు జిల్లాలో ఆరుగురు ఎస్‌ఐలపై జిల్లా ఎస్పీ వేటు వేశారు. ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వకుండా సైరా మూవీకి వెళ్లడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఈ రోజు ఉదయం కోవెల కుంట్ల, నందివర్గం స్టేషన్‌లకు చెందిన ఎస్‌ఐలు సైరా సినిమాకు వెళ్లారు. అయితే నిబంధనల ప్రకారం ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చిన తరువాతే సినిమాకు వెళ్లాల్సి ఉండగా ఎలాంటి సమాచారం లేకుండా వీరంతా సినిమాకు వెళ్లారు. దీంతో ఆరుగురిని వీఆర్‌కు పంపుతూ ఎస్పీ ఫక్కీరప్ప ఆదేశాలు జారీ చేశారు