సైరా ఫస్ట్ డే కలెక్షన్స్ కుమ్మేసింది ..తొలి రోజు ఎన్ని కోట్ల వసూళ్లంటే!

By | October 3, 2019

మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా తెరకెక్కిన భారీ చారిత్రక చిత్రం సైరా నరసింహారెడ్డి. తొలి స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథతో తెరకెక్కిన ఈ సినిమాను సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో మెగా పవర్‌ స్టార్ రామ్‌ చరణ్‌ ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. గాంధీ జయంతి కానుకగా అక్టోబర్‌ 2న తెలుగు, తమిళ, మలయాళ, హిందీ, కన్నడ భాషల్లో విడుదల అయ్యింది .   దాదాపు 350 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా స్వాతంత్ర సమరయోదుడి జీవిత కథతో తెరకెక్కడం విశేషం. 

 ఈ సినిమా లో  బాలీవుడ్ లెజెండ్‌ అమితాబ్‌ బచ్చన్‌ కీలక పాత్రలో నటించటంతో సినిమా మీద బాలీవుడ్‌ ప్రేక్షకుల్లోనూ అంచనాలు భారీగా పెరిగిపోయాయి. మరో కీలక పాత్రలో కన్నడ నటుడు సుధీప్‌ నటించటంతో సైరా, సాండల్‌వుడ్‌లోనూ హాట్‌ టాపిక్‌గా మారింది. తమిళ సెన్సేషన్‌ విజయ్‌ సేతుపతి చేసిన తమిళ వీరుడి పాత్ర కోలీవుడ్‌ జనాలలో అంచనాలు పెంచేస్తోంది. నయనతార, తమన్నా, జగపతి బాబు, రవికిషన్‌ లాంటి భారీ తారాగణం ఉండటంతో సైరా పై విపరీతమైన క్రేజ్ ఏర్పడటంతో అభిమానుల్లో భారీ అంచనాలు ఎర్పడ్డాయి.  ఈ సినిమా ఫస్ట్ షో నుండే పాజీటీవ్ టాక్‌తో దూసుకెళ్తుంది. దీంతో కలెక్షన్స్ కూడా అదిరిపోతున్నాయి. మరి సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్‌ను పరిశీలిస్తే..

సైరా తొలిరోజు దేశ వ్యాప్తంగా రూ. 50 కోట్ల షేర్‌ను దాటినట్టు ఫిల్మ్‌ ట్రేడ్‌ వర్గాల సమాచారం. ఓవర్సీస్‌లో తొలిరోజు దాదాపు రూ. 10 కోట్లు షేర్ రాబట్టినట్టు తెలుస్తోంది. ఈ చిత్రం అమెరికా, ఆస్ట్రేలియాలో బాక్సాఫీసు దగ్గర చక్కటి వసూళ్లు రాబట్టినట్లు సమాచారం. అమెరికా ప్రీమియర్‌ షోలలో 308 లొకేషన్లలో 8,57,765 డాలర్స్ అంటే దాదాపు రూ.6.16 కోట్లు రాబట్టినట్లు సమాచారం. అదేవిధంగా అటూ ఆస్ట్రేలియాలో 39 లొకేషన్లలో A$ 189,237 సాధించినట్లు తెలుస్తోంది.

ఈ సినిమా అమెరికాలో వన్‌ మిలియన్‌ మార్కును ఆల్రేడీ దాటేసింది. ప్రపంచవ్యాప్తంగా రూ.190 కోట్ల భారీ బిజినెస్ చేసిన సైరాకు పాజిటివ్ టాక్ రావడంతో.. లాభాల బాట పట్టడానికి ఒకటి రెండు రోజులకంటే ఎక్కువ టైం పట్టదని అంచనా వేస్తున్నాయి ట్రేడ్ వర్గాలు.తెలుగు రాష్ట్రాల్లో సైరా ప్రీ రిలీజ్ బిజినెస్ మొత్తంగా రూ.106 కోట్ల మేరకు బిజినెస్ జరిగింది.ఆంధ్రాలో ప్రీ రిలీజ్ బిజినెస్ మొత్తంగా రూ.30 కోట్లకుపైగానే జరిగింది.ఇక కేరళ, తమిళనాడు, ఇతర రాష్ట్రాల్లో ఊహించని కలెక్షన్లు నమోదయ్యే అవకాశం కనిపిస్తున్నది.