అస్సలు రానా కి ఏమైంది.. ఎందుకు ఇలా గుర్తుపట్టలేని విధంగా మారిపోయారో తెలుసా

By | October 1, 2019

భల్లాల దేవుడిగా ..ప్రేక్షకుల మెప్పు పొందిన దగ్గుబాటి రానా ప్రస్తుతం కిడ్నీ కి సంబందించిన చికిత్స తీసుకుంటున్నారు! దగ్గుబాటి కుటుంబం అధికారికంగా ప్రకటించక పోయిన గత కొంత కాలంగా అమెరికా లో చికిస్స పొందుతున్నారు అనే వార్తలు వస్తూనే ఉన్నాయి.రానా అందుబాటులో లేని కారణంగా కొన్ని సినిమాలు వాయిదా పడ్డాయి కూడా.

రానా తాజాగా ఓ బ్రాండ్ ప్రమోషన్ నిమిత్తం తన ఫోటోను ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో అప్‌లోడ్ చేశాడు. ఈ ఫోటో అతని అభిమానులకు షాక్ కలిగించింది. మంచి బాడీతో దృఢంగా ఉండే రానా ఇలా సన్నగా అయిపోవడంతో అభిమానులు షాకయ్యారు. చికిత్సలో భాగంగానే రానా ఇలా సన్నబడ్డాడని తెలుస్తోంది. త్వరలోనే చికిత్స పూర్తి చేసుకుని భారత్‌కు వచ్చి షూటింగ్‌లలో పాల్గొనడానికి రానా సిద్ధమవుతున్నాడు.భల్లాల దేవుడి పాత్రలో ఎంతో మెప్పు పొందిన రాణాని చూసి జీరించుకోలేకపోతున్నారు అభిమానులు ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు.