తను భార్య కాదు వరుసకు అక్క…పెళ్లి చేసుకున్న 8 ఏళ్ల తరువాత ఎలా తెలుసు కున్నారు అంటే

By | September 30, 2019

ఏ చిక్కు లేకుండా హాయిగా సంతోషంగా జీవిస్తున్న ఒక జంటకు వింత అయినా అనుభూతి బయటపడింది..ఊహించని షాక్ తగిలింది..ఎనిమిదేళ్ల సంసారం తరువాత నిజం తెలుసుకొని తలలు పట్టుకున్నారు.ఈ వింత సంఘటన ఇంగ్లాండ్ లో చోటు చేసుకుంది.. 24 ఏళ్ల వ్యక్తి ఇటీవల ‘రెడిట్’ అనే సోషల్ మీడియా సైట్ లో తనకు ఎదురు అయినా చేదు అనుభవాన్ని పంచుకున్నాడు..

నా భార్య నా కంటే ఒక ఏడాది పెద్దది. మేం ఎనిమిదేళ్లుగా కలిసి జీవిస్తున్నాం. గతేడాదే పెళ్లి చేసుకుని భార్యా భర్తల్లా కొత్త జీవితాన్ని ప్రారంభించాం. ప్రస్తుతం ఆమె గర్భవతి, 2020లో మా ఇంట్లో మూడో వ్యక్తి అడుగు పెడతాడు. అంతా బాగానే ఉందనుకుంటున్న సమయంలో నాకు ఓ చేదు విషయం తెలిసింది. నా భార్య తల్లితో ఇటీవల మాటల సందర్భంగా నా భార్య తండ్రి గురించి ప్రస్తావనకు వచ్చింది. ఈ సందర్భంగా ఆమె చెప్పిన వివరాలు విని షాకయ్యా. నా భార్య తండ్రి మరెవ్వరో కాదు నా తండ్రే’’

‘‘అది నిజమో కాదో తెలుసుకోవాలనే ఆసక్తితో మేం రహస్యంగా డీఎన్‌ఏ పరీక్షలు చేయించుకున్నాం. రిపోర్టులు కూడా మేమిద్దరం ఒకే తండ్రికి పుట్టిన బిడ్డలమని తేలింది. ఈ విషయం తెలిసిన తర్వాత మనసుకు చాలా బాధ అనిపించింది. అలాగే భయం కూడా పట్టుకుంది. నా బిడ్డ పుట్టినప్పుడు డీఎన్‌ఏ వివరాలను పొందుపరుస్తారు. ఆ సమయంలో ఆమె డీఎన్‌ఏ, నాది ఒకటని తెలిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటారేమో అని భయంగా ఉంది. నా కొడుకు ఆరోగ్యంగా పుడితే ఏ సమస్య లేదు. అలా జరగపోతే మా డీఎన్ఏ వివరాలను బయటపెడతారు. ఇంగ్లాండులో ఇది నేరం.’’

అస్సలు ఎం జరుగుతోంది : ఇంగ్లాండులో రక్త సంబంధికుల మధ్య వైవాహిక, లైంగిక సంబంధాలపై నిషేదం ఉంది. ఒకే వ్యక్తికి పుట్టిన బిడ్డలు ఒకరినొకరు పెళ్లి చేసుకోవడం పిల్లలు జన్యుపరమైన లోపాలను ఎదుర్కొంటారనే కారణంతో ఈ నిబంధనను కఠినంగా అమలు చేస్తోంది. అందుకే ఆ వ్యక్తి తీవ్ర ఆందోళనకు గురవ్వుతున్నాడు. ఇతడి పోస్టును చదివిన కొందరు.. వెంటనే వైద్యుడి సలహా తీసుకోవాలని సూచిస్తున్నారు. అలాగే, చట్టపరమై సమస్యలు ఎదుర్కోకుండా న్యాయవాదులను సంప్రదించాలని చెబుతున్నారు. రక్తసంబంధికులని తెలిసిన తర్వాత కూడా లై* సం కొనసాగిస్తే చిక్కుల్లో పడతారని హెచ్చరిస్తున్నారు. ఈ కామెంట్లు ఆ జంటను మరింత గందరగోళానికి గురిచేస్తున్నాయి. ఇలాంటి కష్టం పగవాడికి కూడా రాకూడదు కదూ!!