బిగ్ బాస్ లో జరుగుతున్న మోసాలు బయటపెట్టిన హిమజ ! అమ్మ బిగ్ బాస్ జనాలని మాములుగా ఆటాడుకోలేదు గా

By | September 25, 2019

సోషల్ మీడియా వస్తున్న ట్రోల్స్ చూసి మనం అందరం ఆశ్చర్యపోయాం నిజమే అని కూడా అనిపించింది ఆమెను నిగ్రహం లేని విగ్రహం అన్నారు కొందరు ఐతే..మొదటి రోజు నుంచి తాను ఎలిమినేట్ అయ్యే రోజు వరకు తనదైన శైలితో ఆటతో ఆకట్టుకుంది తొమ్మిదవ వారం లో ఎలిమినేట్ అయ్యింది మరో అవకాశం ఇచ్చిన బిగ్ బాస్ హౌస్ లో వెళ్ళటానికి వెళ్ళాను అని నాగార్జున గారితోనే చెప్పేసింది. మొహమాటం లేకుండా

తాను ఎలిమినేట్ అవుతున్నందుకు ఏమి బాధ పడటం లేదు అంటూ చెప్పిన హిమజ ఇక్కడితో నా ప్రయాణం ఆగింది కానీ నా జీవితం లో ప్రయాణం ఆగలేదు అంటూ చెప్పింది.. అంతే కాదు వోటింగ్ విధానం మీద బిగ్ బాస్ ఇంటి సభ్యుల మీద తీవ్రంగా వ్యతిరేకతని చూపించింది.బిగ్ బాస్ హౌస్ జైలు లాంటిది కాదు జైలే’ ఫోన్ లేకుండా నేను ఇన్ని రోజులు ఉంటాను అని అనుకోలేదు ఇన్ని డేస్ ఉండటం నిజంగా గ్రేట్

హీరో అవ్వాలన్నా.. విలన్ అవ్వాలనే స్క్రీన్ ప్లే అనేది కీ రోల్. బిగ్ బాస్ హౌస్‌లో వాళ్లు చూపించడాన్ని బట్టే ఎవరు హీరో.. ఎవరు విలన్ అనేది తేలిపోతుంది. వాస్తవం వేరు. అక్కడ ఏం జరుగుతుందో అదే చూపిస్తున్నారు కాని.. హిమజ సెల్ఫిష్ అని ముద్ర వేసేవాళ్లను కెమెరాలకు చూపించారు. మహేష్ ఎలిమినేషన్ అప్పుడు కూడా నేను కావాలని చేయలేదు. బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్‌లో క్లారిటీ లేకపోవడం వల్లే ఇలా జరుగుతుంది.గ్రూప్‌లు ఫామ్ అయిపోయి బిగ్ బాస్‌నే ఆటాడిస్తున్నారు..
బిగ్ బాస్ హౌస్‌లో గ్రూప్‌లు ఉన్నాయి. కొంతమంది గ్రూప్‌లుగా ఉండి.. నామినేషన్ అప్పుడు మూకుమ్మడిగా తమకు ఇష్టం లేనివాళ్లను బయటకు పంపిస్తున్నారు. నేను రిజర్వ్డ్‌గానే ఉన్నాను.

బిగ్ బాస్ వాళ్లకు ముందే కండిషన్ పెట్టా..
బిగ్ బాస్ సీజన్ 3 ఒక్కటే కాదు.. సీజన్ 1, సీజన్ 2లకు కూడా నన్ను రమ్మని పిలిచారు. కాని నేను పెట్టిన ఒకే ఒక్క కండిషన్. ఫుడ్ విషయంలో నన్ను ఏమైనా ఇబ్బంది పెడతారా అని. ఒక్కొక్కరికీ ఒక్కో వీక్ నెస్ ఉంటుంది. నాకు ఫుడ్ సరిగా లేకపోతే ఉండలేను. అలాగని ఒకేసారి ఎక్కువగా తినేయలేను. మీరు గమనిస్తే నేను బిగ్ బాస్ హౌస్‌కి వెళ్లినప్పటికంటే ఇప్పుడు బాగా తగ్గిపోయా. అంటే సరైన ఫుడ్ లేదు. ఎట్లా ఉన్నాలన్నా తినాలి.

ఎవర్ని సేవ్ చేయాలి? ఎవర్ని నామినేట్ డిసైడ్ చేసేది బిగ్ బాస్..
కంటెస్టెంట్స్‌లో ఎవర్ని సేవ్ చేయాలి? ఎవర్ని నామినేట్ చేయాలి అన్నది బిగ్ బాస్ నిర్ణయాలపై ఆధారపడి ఉంటున్నాయి. బిగ్ బాస్ వాళ్లు ఎలాంటి కంటెంట్ కావాలనుకుంటున్నారో అది ఎవరిదగ్గర ఉందో వాళ్లను సేవ్ చేయడానికి ట్రై చేస్తారు. నాకోసం కూడా చేశారు. అది కాదనను.

బిగ్ బాస్ మాతో ఆడలాడు.. ఆడియన్స్‌తో కాదు
బిగ్ బాస్ షో చూస్తున్న ప్రేక్షకులు గేమ్‌లో ఇన్వాల్వ్ అయ్యి.. నా ఫేవరేట్ కంటెస్టెంట్‌కి ఓటు వేయడం మరిచిపోతానేమో అని తపనతో ఓట్లు వేస్తున్నారు. కాని బిగ్ బాస్ ఆడియన్స్‌తో గేమ్స్ ఆడుతున్నారు. కొంతమందిని నామినేషన్స్‌కి రాకుండానే సేవ్ చేసి కాపాడుతున్నారు బిగ్ బాస్.