వేణు మాధవ్ గారి ఆరోగ్యానికి సంబందించిన తాజా వార్త ఇదే ! అయన ఇప్పుడు ఎలా ఉన్నారు అంటే

By | September 25, 2019

ప్రముఖ టాలీవుడ్ హాస్య నటుడు వేణు మాధవ్ ఆరోగ్యం విషమంగా ఉంది. వేణు మాధవ్ గారు తీవ్ర అస్వస్థకు గురి కావడం తో సికింద్రాబాద్ లోని యశోద హాస్పిటల్స్ లో చెరిపించారు. ప్రస్తుతం వేణు మాధవ్ కి చికిస్స జరుగుతుంది. గత కొంత కాలంగా కాలేయ సంబంధిత వ్యాధులతో బాధ పడుతున్నారు.

ఆయనకి వెంటిలేటర్ సహాయం తో ట్రీట్మెంట్ కొనసాగుతుంది.ప్రస్తుతానికి ఆయన icu విభాగంలో ఉన్నారు. వేణు మాధవ్ గారు టాలీవుడ్ లో అనేక సూపర్ హిట్ చిత్రాలు నటించారు.వేణు మాధవ్ ఆరోగ్యం గురించి చాలా రోజుల క్రితమే అనేక వార్తలు వచ్చాయి కానీ ఆ సమయం లో వేణు మాధవ్ బాగానే ఉన్నారు.తన ఆరోగ్యం పై వస్తున్న వార్తలు అన్ని అప్పట్లో కండించారు. గత కొంత కాలంగా కిడ్నీ లివర్ సంబంధిత వ్యాధులతో బాధ పడుతున్నారు.

ఆ సమస్య తీవ్రం కావడంతో హాస్పిటల్ లో జాయిన్ అయ్యారు.వేణు మాధవ్ కండీషన్ క్రిటికల్ గా ఉందని హాస్పిటల్ వర్గాల నుంచి సమాచారం వేణు మాధవ్ సన్నిహితులు ఆయన కుటుంబ సభ్యులు ఆయన త్వరగా కోలుకోవాలని వారు కోరుకుంటున్నారు.సంప్రదాయం. గోకులంలో సీత వంటి సినిమాలతో ఆయన కరీర్ ప్రారంభం అయ్యింది. తమ్ముడు,ఆది,దిల్,సై వంటి సినిమాలలో అద్భుతంగా హాస్యాన్ని పండించారు.