ఎన్టీఆర్ రికార్డును బద్దలు కొట్టిన నాగార్జున : బిగ్ బాస్ 3 రికార్డ్ టీఆర్పీ రేటింగ్

By | August 3, 2019

కింగ్ నాగార్జున బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 3 కి హోస్ట్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఫస్ట్ సీజన్‌కి యంగ్ టైగర్ ఎన్టీఆర్, సెకండ్ సీజన్‌కి నేచురల్ స్టార్ నాని హోస్ట్స్‌గా చేశారు. మూడో సీజన్‌లో నాగ్ తనదైన స్టైల్‌లో హోస్ట్ చేస్తూ తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్నాడు. రీసెంట్‌గా బిగ్ బాస్ ద్వారా టీఆర్పీ రూపంలో మరో కొత్త రికార్డ్ క్రియేట్ చేశాడు కింగ్.

ఎన్టీఆర్ హోస్ట్ చేసిన ఫస్ట్ సీజన్ ఫస్ట్ ఎపిసోడ్ టీఆర్పీ 16.1.. నాని హోస్ట్ చేసిన సెకండ్ సీజన్ ఫస్ట్ ఎపిసోడ్ టీఆర్పీ 15.5.. సీజన్ 3లో కింగ్ నాగార్జున హోస్ట్ చేసిన ఫస్ట్ ఎపిసోడ్ టీఆర్పీ 17.9.. ఇంతకుముందు రెండు సీజన్ల కంటే నాగ్ హోస్ట్ చేసిన థర్డ్ సీజన్ టీఆర్పీనే ఎక్కవగా ఉండడం విశేషం.

మీలో ఎవరు కోటీశ్వరుడు షోని కూడా నాగ్ డీల్ చేసినట్టు చిరంజీవి కూడా హోస్ట్ చెయ్యలేకపోయాడని అంటుంటారు. సిల్వర్ స్క్రీన్ అయినా, స్మాల్ స్క్రీన్ అయినా మా కింగ్ అడుగుపెడితే రికార్డులే రికార్డులు అంటూ హ్యాపీగా ఫీలవుతున్నారు అక్కినేని ఫ్యాన్స్.