పునర్వి భూపాళం బాయ్ ఫ్రెండ్ ఎవరో తెలుసా ?? ఎలా చనిపోయాడు అంటే వింటే కన్నీళ్లు వస్తాయి

By | August 3, 2019

బిగ్ బాస్ హౌస్ లో నిన్నటి ఎపిసోడ్ లో మెజారిటీ పార్టీ ఎమోషనల్ గా సాగింది. ముఖ్యంగా హౌస్ మేట్స్ తమ జీవితంలో చేసిన తప్పులు గురించి, ఎప్పటికి సరిదిద్దుకోల్ని మిస్టేక్స్ గురించి ఒక్కొక్కరు తమ తమ ఫీలింగ్స్ షేర్ చేసుకున్నారు. ఈ క్రమంలో పునర్నవి తన లైఫ్ లో జరిగిన కొన్ని విషయాలను నిన్న బిగ్ బాస్ హౌస్ లో బయటపెట్టింది.

ఈ సందర్భంగా పునర్నవి తన అనుభవాన్ని చెప్పుకొంటూ.. నాకు మొండిపట్టు ఎక్కువ. దాని వల్ల నేను జీవితంలో ముఖ్యమైన వ్యక్తిని కోల్పోయాను. నా ఫస్ట్ లవ్ బ్రేకప్ జరిగింది. కొన్ని కారణాల వల్ల నేను నా బాయ్‌ఫ్రెండ్‌కు దూరం అయ్యాను. అతను పదే పదే నాతో మాట్లాడాలని ట్రై చేసినా.. నేను దూరంగా పెట్టాను. ఈ క్రమంలోనే ఓ రోజు శ్రీలంక పర్యటనకు వెళ్లి కొలంబోలో జరిగిన బాంబ్ బ్లాస్ట్‌లో మరణించాడు.

అతని విషయంలో నేను చాలా పెద్ద తప్పు చేశాననే ఫీలింగ్ నన్ను లైఫ్ లాంగ్ వెంటాడుతుంది. జీవితంలో ఎవరికైనా నేను సారీ చెప్పాల్సి వస్తే అతడికే అని పునర్నవి భావోద్వేగంతో చెప్పింది. ఇక బిగ్‌బాస్‌ హౌస్‌ నుంచి రెండో వ్యక్తి బయటకు వెళ్లేందుకు సమయం ఆసన్నమైంది. ఈ వారం రాహుల్‌, జాఫర్‌, శ్రీముఖి, వరుణ్‌ సందేశ్‌, వితికా షెరు, మషేష్‌ విట్టా, పునర్నవి భూపాలం, హిమజలు నామినేషన్ లో ఉండగా.. ఎవరు ఇంటి నుంచి ఎలిమినేట్‌ అవుతారో అనే విషయం ఆసక్తికరంగా ఉంది.