కొత్త ట్రాఫిక్ రూల్స్ వచ్చేసాయ్,పాయింట్స్ దాటారో

ఆగష్టు 1వతేది నుంచి హైదరాబాద్,రాచకొండ ,సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిథిలో క్రొత్త ట్రేఫిక్ రూల్స్ రానున్నాయి అని సీపీ మహేందర్ రెడ్డి తెలిపారు.ట్రాఫిక్ ఉల్లంఘనలు రోడ్ ప్రమాదాలు తగ్గించే లక్ష్యంతోనే పాయింట్స్ వారి జరిమానా విధానానాం పెనాల్టీ పాయింట్ సిస్టం కి శ్రీకారం చుట్టినట్లు వివరించారు. ఈ రూల్ ప్రకారం ఉల్లంఘన ను బట్టి వాహన చోదకులకు పాయింట్స్ కేటాయిస్తున్నారు👉హెల్మెట్ పెట్టుకోకుండా బైక్ నడిపితే ఒక పాయింట్,
👉మద్యం తాగి వాహనం నడిపితే మూడు పాయింట్లు ఇలా ఒక్కో ఉల్లంఘనకు ఒక్కో రకంగా ఉంది.
👉హెల్మెట్ పెట్టుకోకపోయినా, సీట్ బెల్ట్ పెట్టుకోకుండా వాహనం నడిపినా 1 పాయింట్👉ఆటో డ్రైవర్ తన పక్కసీటులో ప్రయాణికులను తీసుకెళితే 1 పాయింట్
👉గూడ్స్ వాహనాల్లో ప్రయాణికులను అనధికారికంగా ఎక్కించుకుంటే 2 పాయింట్లు
👉రాంగ్ సైడ్ డ్రైవింగ్‌కు 2 పాయింట్లు
మద్యం తాగి టూ వీలర్ నడిపిడే 3 పాయింట్లు. అదే ఫోర్ వీలర్, లారీ, గూడ్స్ క్యారియర్ నడిపిడే 4 పాయింట్లు
👉మద్యం తాగి బస్సు, క్యాబ్, ఆటో వంటి ప్రజా రవాణా వాహనాలు నడిపే 5 పాయింట్లు
👉డ్రైవింగ్ చేసేటప్పుడు రేసింగ్ పెట్టుకోవడం, స్పీడును అమాంతం పెంచడం చేస్తే 3 పాయింట్లు👉రోడ్డు భద్రత నియమాలను ఉల్లంఘించి.. శబ్ద, గాలి కాలుష్య నియంత్రణ లేకుండా బహిరంగ ప్రదేశాల్లో ప్రమాదకరస్థితిలో వాహనం నడిపినా, తోటి వాహనదారుల భద్రతకు ముప్పు వాటిళ్లేలా పార్కింగ్ చేసినా 2 పాయింట్లు
👉ఇన్సూరెన్స్ లేకుండా వాహనం నడిపితే 2 పాయింట్లు
👉పబ్లిక్ లయబిలిటీ సర్టిఫికెట్ లేకుండా ప్రమాదకరమైన వస్తువులు రవాణా చేస్తే 2 పాయింట్లు
👉చైన్ స్నాచింగ్, దోపిడీ లాంటి నేరాలకు వాహనాలను వాడితే 5 పాయింట్లు,
రోడ్లపై నిర్ణయించిన వేగాన్ని మించి 40 కి.మీ. లోపు వేగంతో నడిపితే 2 పాయింట్లు. నిర్ణీత వేగాన్ని మించి 40 కి.మీ. కంటే ఎక్కువ వేగంతో వెళ్తే 3 పాయింట్లు
👉ప్రమాదకరంగా నడపడం/సెల్‌ఫోన్ మాట్లాడుతూ నడపడం/సిగ్నల్ జంపింగ్/లేన్ క్రాసింగ్‌కు 2 పాయింట్లు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *