రిజర్వేషన్ల విధానం ఆ విద్యార్థిని రైతును చేసింది.

దేశంలో రిజర్వేషన్ల విద్యావ్యవస్థ అమలు కారణంగా ఉన్నత వర్గాలకు చెందిన  అనేక మంది పేదరికంలో మగ్గుతూ.. ప్రతిభకు తగిన అవకాశాలను అందుకోలేకపోతున్నారు. కేరళకు చెందిన ఓ యువకుడు తనకు జరిగిన అన్యాయాన్ని వివరిస్తూ ఫేస్‌బుక్ పెట్టిన పోస్టు వైరల్‌గా మారింది. తిరువనంతపురానికి చెందిన లిజో జాయ్ ఇంటర్ సెకండ్ ఇయర్ లో 79.7 శాతం మార్కులు సాధించాడు. అయినా.. అతడికి కోరుకున్న కోర్సులో ప్రవేశం దక్కలేదు. 50 శాతానికి అటూ.. ఇటుగా మార్కులు తెచ్చుకున్న అతడి మిత్రులకు అదే కోర్సులో ఈజీగా సీట్లు దక్కాయి. అయిదో అలాట్‌మెంట్ వరకు వేచి చూసినా.. లాభం లేకపోవడంతో లిజో చిన్న వయసులోనే రైతుగా మారాలని నిర్ణయించుకున్నాడు.ప్రతిభకు తగిన అవకాశం దక్కకపోవడంతో నిరాశ చెందిన లిజో.. ‘ఈ వ్యవస్థలోని తప్పిదాలు నన్ను బలవంతంగా రైతుగా మార్చాయి’ అంటూ ఫేస్‌బుక్‌లో పోస్టు పెట్టాడు. పొలంలో వ్యవసాయ పనులు చేస్తూ దిగిన ఫోటోలను షేర్ చేశాడు. ఇప్పుడివి సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.వ్యవసాయం చేయడం కూడా ఇష్టమే అని చెబుతున్న లిజోకు నెటిజన్ల మద్దతు పెరుగుతోంది. దేశంలో ప్రస్తుతం అమలవుతోన్న అస్తవ్యస్త రిజర్వేషన్ల కారణంగా సంబంధిత వర్గాలకు చెందిన వారిలోనూ చాలా మంది అన్యాయానికి గురవుతున్నారని కొంత మంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *