వారేవా : భూమిపైకి వస్తూనే వండర్ చేశాడు

కొన్ని ఫొటోలు సృష్టించే సంచలనం అంతా ఇంతా కాదు. ప్రపంచమంతా తిరుగుతాయి. అలాంటిదే ఈ ఫొటో. ఎంతో అందంగా.. చూడముచ్చటగా ఉన్నాడు కదూ ఈ బుడ్డోడు. వీడు చేసిన పని ఇప్పుడు ఔరా అనిపిస్తోంది పై ఫోటోను జాగ్రత్తగా గమనిస్తే మీకు బాలుడు చేతిలో ఓ వస్తువు కనిపిస్తోంది. అవును.. అయితే ఇందులో వింతేముందని తీసి పారేయకండి. ఇక్కడే మీరు ఓ విషయం తెలుసుకోవాలి. బుడ్డోడు చేతిలో పట్టుకుంది మాములు వస్తువు కాదు మరి అతడు పట్టుకున్న వస్తువుతో భూమిపై వస్తూనే వండర్ కిడ్ గా మారిపోయాడు. వీడు మాములోడు కాదు. ఇంతకీ అతడు చేతపట్టింది ఏమిటనేగా మీ అనుమానం.అది గర్భనిరోధక వస్తువు. గర్భం రాకుండా ట్రీట్‌మెంట్ తీసుకున్న తర్వాత అది కాస్తా ఫెయిల్ అవ్వడంతో గర్భం వచ్చింది. ఈ కిట్ మాత్రం తల్లి గర్భసంచిలో అలాగే ఉండిపోయింది. డెలివరీ సమయంలో ఈ బుడ్డోడు ఆ వస్తువును చేతిలో పట్టుకుని బయటకు వచ్చాడు. వస్తూ వస్తూనే అమ్మకు ఏదో గిఫ్ట్ తెచ్చినట్లు గట్టిగా చేత పట్టుకుని వచ్చాడు.అయితే ఇలా జరగటం చాలా అరుదు అంపటన్నారుఆమెకు డెలివరీ చేసిన ఆస్పత్రి వైద్యులు. అమెరికాలోని టెక్సాస్‌కు చెందిన లూసి హెలీన్ అనే మహిళకు ఈ వండర్ కిడ్ జన్మించాడు.డెలివరీ సమయంలో హెలీన్ పక్కనే ఉన్న ఆమె స్నేహితురాలు దీన్ని గమనించి ఫోటో తీసి ఫేస్‌బుక్‌లో పెట్టింది. అంతే కొన్ని క్షణాల్లోనే ఈ ఫోటో వైరల్‌గా మారిపోయింది.ప్రస్తుతం ఈ బుడ్డోడి ఫోటో ప్రపంచవ్యాప్తంగా తెగ హల్‌చల్ చేస్తోంది. ఫోటోపై సోషల్ మీడియాలో నెటిజన్‌లు గమ్మతైన కామెంట్లు చేస్తున్నారు. బుడ్డోడు మాములోడు కాదని.. వస్తూనే మమ్మీకి గిఫ్ట్ తెచ్చిన వండర్ కిడ్ అని కామెంట్లు వస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *