హాస్పిటల్లోనే హీరోయిన్ బామ్మ స్టెప్పులు

మెగా పవర్ స్టార్ రాంచరణ్ హీరోగా, సమంత హీరోయిన్ గా వెరైటీ చిత్రాల దర్శకుడు సుకుమార్ దర్శకత్వం లో మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మించిన సినిమా రంగస్థలం. ఇప్పటికే విడుదలయిన ఈ సినిమాలోని పాటలు శ్రోతలను ఉర్రూతలూగిస్తున్నాయి.దేవిశ్రీ ప్రసాద్.. ఈ మూవీకి చక్కటి సంగీతాన్ని అందించాడు. ‘జిల్.. జిల్… జిగేల్ రాణి..’ అంటూ ఐటెం సాంగ్ అయితే మాస్‌ను ఊపేస్తోంది.ఈ ఊరమాస్ పాట వింటే ఎవరైనా స్టెప్పులు వేయాల్సిందే. హాస్పిటల్లో రెండు రోజులుగా చికిత్స పొందుతున్న పూజా హెగ్డే వాళ్ల బామ్మ కూడా జిగేల్ రాణి పాటకు స్టెప్పులేశారు. అనారోగ్యాన్ని పక్కనబెట్టి మరీ 83 ఏళ్ల వయసులోనూ ఆమె ఉత్సాహంగా డ్యాన్స్ చేసిన వీడియోను పూజా ట్వీట్ చేశారు.