కేవలం 20 బంతుల్లో సంచలన సెంచరీ సాధించిన వ్రిద్ధిమాన్ సాహా

భారత్ క్రికెట్ జట్టు టెస్టు కీపర్ వ్రిద్ధిమాన్ సాహా రికార్డు పుస్తకాల్లో స్థానం సంపాదించాడు. అతను వెస్ట్ బెంగాల్ లో జరిగిన ఒక లోకల్ టీ 20 ఆటలో కేవలం 20 బంతుల్లో శతకం సాధించి అందరిని అబ్బురపరిచారు.అతను మోహన్ బాగాన్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తూ కేవలం ఏడు ఓవర్లలో 151 పరుగుల టార్గెట్ ను అలవోకగా ఛేదించాడు. పశ్చిమ బెంగాల్ లోని కాళీ ఘాట్ లో జరుగుతున్న జెసి ముఖేర్జీ ట్రోఫీ లో ఆడుతూ అతను ఈ రికార్డు ను సాధించడం విశేషం.మోహన్ బగాన్ జట్టుకు ఆడుతున్న సాహా 20 బంతుల్లో 102 పరుగులు సాధించాడు. మొత్తం 18 బంతులు బౌండరీకి తరలించాడట.. 14 సిక్సర్లు.. 4 ఫోర్లు కొట్టాడు సాహా ఈ ఇన్నింగ్స్ లో. 152 పరుగుల లక్ష్యంతో బరి లోకి దిగిన సాహా జట్టు కేవలం 7 ఓవర్లలో చేజింగ్ చేసింది. ఎప్పుడూ లోయర్ ఆర్డర్ లో బ్యాటింగ్ చేసే సాహా.. ఈసారి ఓపెనర్ గా వచ్చాడు. వచ్చీ రాగానే బౌలర్లను ఊచకోత కోశాడు. ఒక్క వికెట్ కూడా పడకుండానే మ్యాచ్ ముగించేయడం విశేషం.సాహా ఇంత త్వరగా సెంచరీ సాధించడంతో, ఇప్పటి వరకు రికార్డు ఐన అన్ని క్రికెట్ మ్యాచ్ లలో ఇదే అత్యంత వేగమైన సెంచరీ అని తెలుస్తుంది. ఈ ఏడాది సన్ రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడనున్న సాహా, ఐపీఎల్ వేలం లో ఏకంగా 5 కోట్లు పలికి అందరిని ఆశ్చర్యానికి గురిచేశాడు