ఇదో కొత్తరకం చోరీ చూస్తే నవ్వు ఆపుకోలేరు:వీడియో వైర‌ల్‌

కన్యాకుమారిలోని కొలాచెల్ ప్రాంతంలోని ఓ షాపులో విచిత్ర చోరీ జరిగింది. ఓ వ్యక్తి ముఖానికి పాలిథిన్ కవర్ పెట్టుకొని ఎవరూ చూడకముందు ఓ షాప్‌లోకి ప్రవేశించాడు. అందులోకి వెళ్లిన అతడు కొంత నగదును ఎత్తుకెళ్లాడు. ఇదంతా అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయింది. మరుసటి రోజు షాప్ యాజమాని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు సీసీటీవీ ఫుటేజిని పరిశీలించారు. అందులో చోరీకి పాల్పడిన వ్యక్తి ముఖం స్పష్టంగా కనిపిస్తోంది. అంతేగాక అతని ఎడమచేతికి టాటూ ఉన్నట్లు గుర్తించారు. దీని సాయంతో గంటల వ్యవధిలోనే పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో చూసిన నెటిజన్లు పడిపడి నవ్వుతున్నారు. పాపం ఇతనికి దొంగతనం కూడా చేయడం తెలియదని.. ముఖం అందరికీ కనబడేలా అతడు కవర్‌ను పెట్టుకోవడంపై తమదైన శైలిలో స్పందిస్తున్నారు.