కొత్త రేషన్ కార్డులకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

నిత్యావసర సరకులకు కావల్సిన ఆహార భద్రత కార్డు (రేషన్ కార్డు)ల కోసం దారిద్య్రరేఖకు దిగువనున్న అనేక కుటుంబాలు చాల కాలం నుంచి ఎదురుచూస్తున్నాయి. అయితే అర్హత కలిగిన కుటుంబాలకు ఆహార భద్రత కార్డులను అందించాలని తెలంగాణ ప్రభుత్వం  నిర్ణయించింది. ఈ మేరకు పౌరసరఫరాల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఏప్రిల్ 1 నుంచి మీ సేవ కేంద్రాల్లో నిర్దేశిత ధృవపత్రాలు, ఇతరత్రా వివరాలతో కూడిన దరఖాస్తును రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.
జతచేయాల్సినవి ఇవే… :: ప్రస్తుత నివాసం(సరైన), చిరునామా వివరాలు
దరఖాస్తుదారు (కుటుంబ యజమాని) గుర్తింపు కార్డు ఓటరు / డ్రైవింగ్ లైసెన్స్ / ఆధార్ కార్డు నకలు కుటుంబ యజమాని పాస్‌పోర్టు సైజ్ పోటో తప్పని సరి…కుటుంబ యజమాని వయస్సు ధ్రువీకరణపత్రం లేదా పాఠశాలలో చదివినప్పటి పుట్టిన తేదీ ధ్రువీకరణ పత్రం జతపర్చాలి.కుటుంబ యజమాని సంవత్సర ఆదాయం, వృత్తి వివరాలను దరఖాస్తులో పొందుపర్చాలి. గ్రామీణ ప్రాంతం వారి ఆదాయం రూ. ఒక లక్ష 60వేలు, పట్టణ ప్రాంత ప్రజల ఆదాయం రూ.2లక్షలకు మించరాదు….సమీపంలోని మీ సేవ కేంద్రాల్లో దరఖాస్తుతో పాటు పైన పేర్కొన్న ధృవపత్రాలు, ఇతరాలను సమర్పించి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.దరఖాస్తుల కుటుంబ సభ్యుల వివరాలను పొందుపర్చాలి.నిర్ణీత గడువు లోగా వచ్చిన దరఖాస్తులను స్థానిక రెవెన్యూ అధికారులు పరిశీలించి నిబంధనలకు లోబడి అర్హత కలిగిన కుటుంబాలకు కొత్తగా ఆహార భద్రత కార్డులను జారీ చేస్తారు.