పోలీస్ ను రోడ్డుపై పరిగెత్తించి కొట్టిన పేకాటరాయుళ్లు

శాంతి భద్రతలు కాపాడాల్సిన పోలీసులకే రక్షన లేకుండా పోతుంది. పేకాట ఆడటం తప్పన్నందుకు పోలీసుని చితకబాదారు. ఈ దారుణ సంఘటన  మార్చి 19 కర్ణాటక రాజధాని బెంగళూరులో జరిగింది. పేకాట స్థావరంపై దాడి చేసిన ఓ పోలీసును పేకాటరాయుళ్లు చితకబాదారు. దుండగుల నుంచి తప్పించుకునేందుకు పోలీస్ పెట్టిన పరుగులతో ఆ ప్రాంతం అంతా బీభత్సంగా మారింది. అక్కడున్న వారెవరూ దుండగులను అడ్డుకోలేకపోయారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన పోలీస్ ను.. ఆస్పత్రికి తరలించారు. ఖాకీని కొట్టిన వారిలో నలుగురిని అరెస్ట్ చేశారు. వీరిపై ఇప్పటికే పలు దొంగతనం కేసులు ఉన్నాయి. పేకాట ఆడటమే తప్పు.. అడ్డుకున్న పోలీస్ ను ఇలా రోడ్డుపై పరిగెత్తించి మరీ కొట్టటంపై బెంగళూరు పోలీసులు సీరియస్ గా ఉన్నారు.నడిరోడ్డుపై పరుగులు పెట్టిస్తూ పేకాటరాయుళ్లు కొడుతుంటే పక్కన ఉన్నోళ్లంతా ప్రేక్షకుల పాత్ర పోషించడం గమనార్హం.