తెలుగు యువకులకు చెన్నై సుందరి మాయ వల

ప్రేమ, పెళ్లి పేరుతో ఎంతో మంది యువకులను, వ్యాపారవేత్తలను మోసం చేసిన ఓ కిలాడీ లేడీని పట్టుకునేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. ఆమె కోసం గాలింపు చేపట్టారు. ఈ నేపథ్యంలో ఆమె ఫొటోలను విడుదల చేశారు. తమిళనాడులోని చెన్నైకి చెందిన ఆ యువతి.. తెలంగాణలోని వరంగల్, హైదరాబాద్ నగరాల్లో పలువురిని ఈ విధంగా మోసం చేసింది. ఇప్పుడు ఆమె తన మకాంను బెంగళూరుకు మార్చినట్లు తెలిసింది.