కొత్త నోట్ల ముద్రణ ఖర్చెంతో తెలిస్తే షాక్ అవుతారు.

పెద్ద నోట్ల రద్దు దేశం లో ఓ సంచలనం,దీని ద్వార చాలా మార్పులు వచ్హాయి,పాత నోట్లు మొత్తం రద్దు కావడం తో కొత్త నోట్లు ముద్రణ కి చాలా  ఖర్చు చేసింది పెద్ద నోట్ల రద్దు తర్వాత కొత్త రూ.500ల కరెన్సీ నోట్ల ముద్రణకు కేంద్ర ప్రభుత్వం దాదాపు రూ.5000 కోట్లు ఖర్చు చేసింది.ఈ మేరకు లోక్‌సభకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి పీ.రాధాకృష్ణన్ లిఖితపూర్వక సమాధానమిచ్చారు. డిసెంబరు 8 వరకు 1,695.7 కోట్ల కొత్త రూ.500ల నోట్లను ముద్రించినట్లు తెలిపారు. దీని కోసం రూ.4,968.84 కోట్లు ఖర్చే చేసినట్లు తెలిపారు.అలాగే కొత్త రూ.2,000ల కరెన్సీ నోట్ల ముద్రణకు రూ.1,293.6 కోట్లను ఖర్చు చేశారు. ఆర్బీఐ మొత్తం 365.4 కోట్ల రూ.2000 నోట్లను ముద్రించింది.పెద్ద నోట్ల రద్దు తర్వాత కొత్త డిజైన్లలో రూ.50, రూ.200, రూ.500, రూ.2000 నోట్లను తీసుకొచ్చినట్లుమంత్రి తెలిపారు.పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో నెలకొన్న విపత్కర పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొన్నామని, దాదాపు సాధారణ పరిస్థితులను తెచ్చామని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) గవర్నర్ ఉర్జిత్ పటేల్ తెలిపారు.