కస్టమర్లు కి షాక్ ఇచ్చిన ఎయిర్‌టెల్

అధార్‌ను ఎయిర్‌టెల్ దుర్వినియోగం చేయడంతో ఆధార్‌ను జారీ చేసే యు.ఐ.డి.ఎ.ఐ(ఉడాయ్) కఠిన నిర్ణయం తీసుకుంది. ఆధార్ వెరిఫికేషన్‌కు అనుమతించే ఈకైవెసి లైసెన్సును ఎయిర్‌టెల్, ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్‌కు తాత్కాలికంగా సస్పెండ్ చేసింది. ఫలితంగా, ఈకైవెసి ప్రక్రియను,పేమెంట్స్ బ్యాంక్ క్లయింట్ల ఈకైవెసిని ఉపయోగించుకుని భారతీ ఎయిర్‌టెల్‌ కానీ, ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్‌ కానీ మొబైల్ కస్టవుర్లకు చెందిన ‘ఆధార్’ ఆధారిత ‘సిమ్’ వెరిఫికేషన్ నిర్వహించడానికి లేదు. భారతీ ఎయిర్‌టెల్ తన చందాదారులతో పేమెంట్స్ బ్యాంక్ ఖాతాలు తెరిపించేందుకు ఆధార్-ఈకైవెసీ ఆధారిత ‘సిమ్’ వెరిఫికేషన్ ప్రక్రియను ఉపయోగించుకుంటోందని ఆరోపణలు రావడంతో యు.ఐ.డి.ఎ.ఐ ఈ కఠిన చర్య తీసుకుంది. చందాదారులకు తెలిపి వారి అనుమతి తీసుకోకుండా ఎయిర్‌టెల్ ఆ పని చేస్తోందని ఆరోపణ లొచ్చాయి. ఎల్.పి.జి సబ్సిడీ అందుకునేందుకు అటువంటి పేమెంట్స్ బ్యాంక్ ఖాతాలను ఉపయోగించుకోవడం పట్ల కూడా యు.ఐ.డి.ఎ.ఐ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.పెద్ద కంపెనీ లు ఇలా చేస్తే ప్రైవసీ ని ఎలా కాపాడతారు అని ప్రజల్లో ఆందోళన చాలా ఉంది