జియో దీపావళి బంపర్ ఆఫర్…రీఛార్జీతో వంద శాతం క్యాష్‌బ్యాక్.

జియో సంచలనాలకి కొలువు అయ్యింది..నెట్ ప్రపంచంలో తనకి తిరుగులేని దారిని ఏర్పాటు చేసుకుంది. నెట్ వాయిస్ కాల్స్ ఫ్రీ అంటూ సంచలన ప్రకటన చేసే తనతో పోటీ పడేవాళ్ళకి చుక్కలు చూపించింది.ఇప్పుడు మరొక సంచలన ప్రకటన చేసింది జియో.. దీపావళి ఆఫర్ అంటూ ఒక ప్లాన్ ప్రకటించింది.రూ.399 జియో ధన్ ధనా ధన్ ప్లాన్‌ను ఈ నెల 12 నుంచి 18 తేదీల మధ్య రీచార్జి చేసుకున్న వారికి అంతే మొత్తాన్ని క్యాష్‌బ్యాక్ రూపంలో అందిస్తున్నది. మొత్తం రూ.400 విలువ గల 8 వోచర్లను అందిస్తున్నది. ఒక్కో వోచర్ విలువ రూ.50 ఉంటుంది. అయితే ఇలా వచ్చిన వోచర్లను నవంబర్ 15వ తేదీ తరువాతే వినియోగించుకోవాలి.అక్టోబర్ 12వ,తేదిన ఆఫర్‌ ప్రారంభమైంది. ఈ ఆఫర్‌ అక్టోబర్‌ 18 వరకు అందుబాటులో ఉండనుంది. ఈ క్యాష్‌బ్యాక్‌ వోచర్ల రూపంలో లభిస్తుంది. వీటిని మళ్లీ రీఛార్జ్‌ చేసుకునేందుకు ఉపయోగించుకోవచ్చు. రూ.399 ఆఫర్‌తో ప్రీపెయిడ్‌ కస్టమర్లకు 84జీబీ డేటా(రోజుకు 1జీబీ) ఇస్తున్న విషయం తెలిసిందే. దీంతో పాటు ఉచిత ఎస్‌ఎంఎస్‌, ఉచిత కాలింగ్స్‌ అందిస్తుంది. ఈ ఆఫర్‌ వ్యాలిడిటీ 84రోజులు. అయితే తాజాగా తీసుకొచ్చిన దీపావళి ధన్‌ ధనా ధన్‌ ఆఫర్‌లో కస్టమర్లు అక్టోబర్‌ 12 నుంచి 18 మధ్య రూ.399తో రీఛార్జ్‌ చేసుకుంటే.. వారికి రూ.50 విలువ గల 8 వోచర్లు వస్తాయి. అంటే మొత్తం రూ.400 వస్తుంది. ఈ వోచర్లను మళ్లీ రీఛార్జ్‌ చేసుకునేందుకు ఉపయోగించుకోవచ్చు. నవంబర్‌ 15 తర్వాత మాత్రమే ఈ వోచర్లను వినియోగించుకోవచ్చు. అయితే రూ.309 అంతకంటే ఎక్కువ ప్లాన్‌కు మాత్రమే ఈ వోచర్లు వర్తిస్తాయి. ఇప్పటికే ఏదైనా జియో ప్లాన్‌ వినియోగించుకుంటున్నవారు ఈ ఆఫర్‌ తీసుకుంటే ప్రస్తుత ప్లాన్‌ ముగిసిన తర్వాతే ఈ కొత్త ఆఫర్‌ ప్రారంభమవుతుంది.