ఇక మీ మొబైల్ లోనే ఆధార్‌ కార్డు.ఈ యాప్ ఉంటే చాలు

ఆధార్ కార్డు ఇప్పుడు ఇది తప్పనిసరి అయిన గుర్తింపు కార్డు, కొత్త బండి తీసుకోవాలి అన్నా, సిమ్ తీసుకోవాలి అన్నా, బ్యాంకు అకౌంట్లు, క్రెడిట్ కార్డులు అలాగే ఎలాంటి ప్రభుత్వ ఉద్యోగానికి అప్లై చేయాలన్న, ఎంట్రన్స్ టెస్ట్ లు రాయాలన్న… పాన్ కార్డు..ఇలా చాలా ముఖ్యమైన పనులకు ఆధార్ కార్డు తప్పనిసరిఅన్నింటికి ఆధారమైన ఆధార్ కార్డును ఇప్పటి నుంచి  జేబులో పెట్టుకుని తిరగాల్సిన అవుసరం లేదు. మీ చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు ఆధార్ మీ చెంత ఉన్నట్టే. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ)  ఆండ్రాయిడ్ ఫోన్ ప్లేస్టోర్‌లో ‘ఎంఆధార్’ అనే  యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఇక అవసరం ఏదైనా సరే, ఆధార్ కార్డ్ తప్పనిసరి అయితే మీ స్మార్ట్ ఫోన్ ఓపెన్ చేస్తే  ఆధార్ సాఫ్ట్ కాపీ దర్శనమిస్తుంది.దానితో ఆధార్‌తో సంబంధం ఉన్న  అన్ని పనులు చేసుకోవచ్చు. ఎంఆధార్‌ యాప్‌ గూగుల్‌ ప్లేస్టోర్‌ ద్వారా డౌన్‌లోడ్‌ చేసుకొని ఇంస్టాల్ చేయాలిఅందులో మన వివరాలు ఎంటర్‌ చేయడంతోనే ఫొటోతో పాటు పేరు, పుట్టిన తేదీ, చిరునామా ఇతర వివరాలు కనిపిస్తాయి. ఒరిజినల్‌ ఆధార్‌కార్డుకు సాఫ్ట్‌ కాపీలాగా ఉంటుంది. ఆండ్రాయిడ్‌ ఫోన్‌లలో మాత్రమే ఈ సౌకర్యం ఉంది.ఆధార్ కార్డ్ తప్పనిసరి అయితే మీ స్మార్ట్ ఫోన్ ఓపెన్ చేస్తే  ఆధార్ సాఫ్ట్ కాపీ దర్శనమిస్తుంది
App Link >>> Click Here