ఓ 21 ఏళ్ల కుర్రాడు అమేజాన్‌ను భారీ ఎత్తున ముంచేశాడు. ఎలానో తెలిస్తే షాక్ అవుతారు

ఆన్ లైన్ కొనుగోళ్ళు ఇ రోజుల్లో ఎక్కువ గా ఉన్నాయ్..అలానే మోసాలు కూడా అలానే ఉన్నాయ్..ఇ సారి ఈ-కామెర్స్ సంస్థ అమేజాన్‌ను ఓ 21 ఏళ్ల కుర్రాడు భారీ ఎత్తున ముంచేశాడు. కేవలం రెండు నెలల వ్యవధిలోనే ఖరీదైన ఫోన్లను ఆర్డరివ్వడం.. డబ్బు కట్టేసి.. ఖాళీ బాక్స్ వచ్చిందని ఫిర్యాదు చేస్తుండేవాడు. పాలసీ ప్రకారం అమేజాన్ సంస్థ రిఫండ్ చేసేది. ఇలా రూ.50లక్షలు పోయాక అమేజాన్ మేలుకొంది. అంతే పోలీసులకు ఫోన్ కొట్టింది. దీంతో మోసగాడి బండారం బయటపడింది. వివరాల్లోకి వెళితే, శివమ్ చోప్రా అనే ఢిల్లీ యువకుడు హోటల్ మేనేజ్‌మెంట్ కోర్సు చేశాడు. అయితే నైపుణ్యం లేక ఉద్యోగం సంపాదించడంలో విఫలమయ్యాడు. ఈ సంవత్సరం మార్తిలో అతనికి ఓ ఐడియా వచ్చింది. అమేజాన్ నుంచి రెండు ఫోన్లు ఆర్డర్ చేశాడు. అమేజాన్ నుంచి యాపిల్, శాంసంగ్, వన్ ప్లస్ వంటి ప్రముఖ కంపెనీల హైఎండ్ ఫోన్లను వేరేవేరే ఫోన్ నెంబర్లు, చిరునామాల నుంచి ఆర్డర్ ఇచ్చేవాడు.ఇంక చోప్రా ఆగకుండా ఐఫోన్, శాంసంగ్, వన్‌ప్లస్ వంటి ప్రీమియం ఫోన్లను వేర్వేరు అమెజాన్ అకౌంట్ల నుంచి బుక్‌చేశాడు.  కొత్త ఫోన్ బుక్‌చేసిన ప్రతిసారీ వేరు వేరు అడ్రస్‌లు మార్చి ఇచ్చేవాడు. తెలివిగా ఫోన్ నంబర్లు కూడా మార్చేవాడు. దీనికోసం లెక్కలేనన్ని సిమ్ కార్డులను శివమ్ కొనుగోలు చేశాడు. అమెజాన్ ఇచ్చిన గిఫ్ట్ కూపన్లతో ఫోన్‌లు బుక్ చేసేవాడు. ఆ తరవాత తాను నొక్కేసిన ఫోన్లను ఓఎల్ఎక్స్ వంటి వెబ్‌సైట్లలోనూ లేదంటే ఢిల్లీలోని ప్రముఖ గఫర్ మార్కెట్‌లోనూ అమ్మేసేవాడు. ఈ విధంగా మొత్తం 166 ఫోన్లను కొట్టేసి అమ్మేశాడు.అతనికి సిమ్ కార్డులను సరఫరా చేసేందుకు సచిన్ జైన్ అనే చిన్న టెలికామ్ స్టోర్ ఓనర్ సహకరించాడు. ఏకంగా 141 ప్రీ యాక్టివేటెడ్ సిమ్‌లను శివమ్‌కు ఇచ్చాడు. ఆపై రూ.50లక్షల వరకు అమేజాన్‌ను మోసం చేశాక సదరు సంస్థ పోలీసులను ఆశ్రయించింది. అమేజాన్ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు, శివమ్ నుంచి 19 మొబైల్ ఫోన్లు, 12 లక్షల నగదు, 40 బ్యాంక్ పాస్ బుక్ లు, చెక్కులు సీజ్ చేశారు.