వామ్మో పెట్రోల్ పంపుల్లో సిగరేట్ తాగడం వల్ల ఏం జరిగిందో వీడియో చూడండి షాక్ అవుతారు

పెట్రోల్ పంపుల్లో సిగిరేట్ కాల్చొద్దని వినియోగదారులను ఎప్పుడూ హెచ్చరిస్తూనే ఉంటారు పెట్రోల్‌ పంపు సిబ్బంది. ఇదివరకు పెట్రోల్ పంపుల్లో సిగిరేట్లు కాల్చడం వల్ల జరిగిన అనర్థాలు చాలానే ఉన్నాయి. అయితే.. రీసెంట్‌గా ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తున్నది.యూరప్ కంట్రీ బల్గేరియాలోని సోఫియాలో ఈ ఘటన జరిగింది. ఓ వ్యక్తి తన కారులో పెట్రోల్ కొట్టిద్దామని పెట్రోల్ బంకుకు వెళ్లాడు.అయితే.. ఆ వ్యక్తి పెట్రోల్ పంపులో కారు దిగి వెంటనే సిగిరేట్ వెలిగించాడు. దీంతో సిగిరేట్ తాగడం వెంటనే ఆపివేయాలని పెట్రోల్ బంకు సిబ్బంది ఎంత వారించినా వినలేదు. దీంతో పెట్రోల్ బంకుకు చెందిన సిబ్బందిలోని ఓ వ్యక్తి మంటలార్పే పరికరాన్ని తీసుకొచ్చి సిగిరేట్ తాగుతున్న వ్యక్తిమీదికి స్ప్రే చేశాడు.దీంతో ఆ ప్రాంతమంతా పొగతో కమ్ముకుపోయింది. ఈ ఘటన అంతా బంక్‌లో ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డయింది.ఆ వీడియో చుడండి