స్మార్ట్ ఫోన్ రంగం లో మరో సంచలనం ! రూ.1399కే ఎయిర్ టెల్ 4G స్మార్ట్ ఫోన్

టెలికాం మార్కెట్‌లో దిగ్గజ నెట్వర్క్ లకు చుక్కలు చూపించిన రిలయన్స్‌ జియోకు చెక్‌ పెట్టడానికి దిగ్గజ కంపెనీలన్నీ ఒక దాని తరవాత ఒకటి పధకాలు రచిస్తున్నాయి. జియో అంటే.. దానికి మించిన ఆఫర్ తో కొత్త ఫోన్ రిలీజ్ అవుతోంది. ఇప్పటికే ప్రకటించినట్లుగా ఎయిర్ టెల్ 4G స్మార్ట్ ఫోన్ ధరను నిర్ణయించింది. జియో కంటే 100 రూపాయలు తక్కువగా.. రూ.1399కే స్మార్ట్ ఫోన్ అందిస్తున్నట్లు తెలిపింది. కార్బన్ కంపెనీతో కలిసి పని చేస్తుంది. స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ ఆధారితంగా పని చేస్తుందని ప్రకటించింది.ఎయిర్ టెల్ 4G స్మార్ట్ ఫోన్ ఫీచర్స్ ఇలా ఉన్నాయి :
ఈ స్మార్ట్ ఫోన్ పేరును కార్బన్ A40 ఇండియగా నామకరణం చేశారు. టచ్ స్క్రీన్, డ్యూయల్ సిమ్ పని చేస్తుంది. యూట్యూబ్, వాట్సాప్, ఫేస్ బుక్ కూడా పని చేస్తోంది. మిగతా అన్ని పాపులర్ యాప్స్ ను సపోర్ట్ చేస్తుంది. డేటా ఛార్జీని అనౌన్స్ చేసింది ఎయిర్ టెల్. నెలకు రూ.169తో ప్యాకేజీ ప్రారంభం అవుతుంది.డిపాజిట్ స్కీం ఇలా ఉంది :
సేమ్ టూ సేమ్ జియో మాదిరిగానే ఎయిర్ టెల్ – కార్బన్ 4G స్మార్ట్ ఫోన్ డిపాజిట్ వసూలు చేస్తోంది. రూ.2వేల 899 రూపాయలు డౌన్ పేమెంట్ చేయాలి. అప్పుడే ఫోన్ ఇస్తారు. మూడు సంవత్సరాలు (36నెలలు) తర్వాత ఫోన్ తిరిగి ఇస్తే డిపాజిట్ వస్తుంది. దీని కోసం ప్రతినెలా రూ.169 రీఛార్జ్ చేసుకోవాలి. ప్రతి నెలా రీఛార్జ్ చేసుకోకపోతే రీఫండ్ రాదు.కేవలం కార్బన్‌తో మాత్రమే కాకుండా ఇతర మొబైల్ తయారీ సంస్థలతోనూ ఎయిర్‌టెల్ భాగస్వామ్యం కానుంది. ఆయా కంపెనీలతో కలిసి తక్కువ ధరకే 4జీ ఆండ్రాయిడ్ ఫోన్లను తయారు చేసి వినియోగదారులకు అందివ్వనుంది. ఇక ఈ 4జీ ఆండ్రాయిడ్ ఫోన్ తో జియోకు ఎయిర్‌టెల్ ఏ విధంగా పోటీనిస్తుందో వేచి చూడాలి. కాగా ఎయిర్‌టెల్ విడుదల చేసిన ఈ కార్బన్ ఎ40 ఇండియ‌న్ బడ్జెట్ ఆండ్రాయిడ్ 4జీ ఫోన్ త్వరలోనే వినియోగదారులకు రీటెయిల్ స్టోర్లలో లభ్యం కానుంది.