రాత్రికి రాత్రి కోటీశ్వరులైన 8 మంది భారతీయులు

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో ఎనిమింది మంది భారతీయులు రాత్రికి రాత్రే కోటీశ్వరులయ్యారు. గల్ఫ్ దేశాల్లో లాటరీలను అధికారికంగా నిర్వహిస్తారన్నసంగతి తెలిసిందే. ఈ లాటరీలు అదృష్టవంతులను వరించి, రాత్రికి రాత్రి వారి జాతకాలను మార్చేస్తాయన్న సంగతి కూడా తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా యూఏఈలో నిర్వహించిన బిగ్ టికెట్ డ్రా నెలవారీ లాటరీలో పదిమంది విజేతలను ప్రకటించింది. ఇందులో ఎనిమిది మంది భారతీయులు కాగా, మిగిలిన ఇద్దరూ ఫిలిప్పీన్స్,కెనడా దేశాలకు చెందినవారు కావడం విశేషం. వీరందరికీ ఒక్కొక్కరికి 1.76 కోట్ల రూపాయల నగదు లభించనుంది. ఈ లాటరీ మొత్తం 17.6 కోట్ల రూపాయలు కావడం విశేషం. లాటరీలో విజయం సాధించడం ఆనందంగా ఉందని విజేతలు తెలిపారు.43 ఏళ్ల చంద్రేష్ మోతీవర్స్ దుబాయ్ లో ఉన్న నగల బృందంలో ముఖ్య ఖాతాదారుడు 2005 నుండి నివసిస్తున్నాడు.మొదట నాకు ఒక కాల్ వచ్చింది. అబుదాబి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో గురువారం జరిగిన బిగ్ టికెట్ డ్రా మీ పేరు మీద1.76 కోట్ల లాటరీ వచ్చింది అన్నారు మొదట నేను నమ్మలేదు ఎవరైనా జోక్ చేస్తున్నారు అని అనుకున్నాను . అయితే లాటరీ నిర్వాహకుల నుండి నాకు రెండవసారి కాల్ వచ్చింది మీరు కొన్న లాటరీ మీద బంపర్ ఆఫర్ గెలుచుకున్నారు అని చెప్పగానే నేను ఆశ్చర్యపోయాను,అబుదాబిలో మెగా లాప్పీ డ్రాలో ప్రతి ఒక్కరు రూ .1.76 కోట్లు (ఒక మిలియన్ దిర్హామ్) కంటే ఎక్కువ గెలిచి జాక్పాట్ కొట్టిన 10 మందిలో ఎనిమిది మంది భారతీయులు ఉన్నారు.