దేవుడికి కొబ్బరికాయ ఎందుకు కొడతారో తెలుసా..?

మనం ఆలయానికి వెళ్ళినప్పుడు కానీ ఇంట్లో దేవుడి ముందు కానీ మనం మొదట దేవుడికి టెంకాయను సమర్పిస్తాం ఎందుకో మీకు తెలుసా!మన దేశం సంస్కృతీ సాంప్రదాలయాలకు పెట్టింది పేరు. ఈ పవిత్ర భారతదేశం సాక్షాత్తు ఎందరో దేవుళ్ళ నిలయం. మన కోర్కెలు తీర్చే భగవంతునికి మనం నిండైన మనసుతో స్వచ్చమైనవి ప్రసాదంగా ఏది ఇచ్చిన మనలోని ఆశాంతి తొలగి సంతోషం కలుగుతుంది. మనం భగవంతునికి ఇచ్చే నివేదన చాలా పవిత్రంగా ఉండాలి అలాగే భగవంతుడిని నిండైన మనసుతో పూజించడమే మనం భగవంతునికి చేసే సేవ.మనం ఆలయానికి వెళ్ళినప్పుడు కానీ ఇంట్లో దేవుడి ముందు కానీ మనం మొదట దేవుడికి టెంకాయను సమర్పిస్తాం ఎందుకో మీకు తెలుసా!టెంకాయలోని నీరు పకృతి పరంగా ఎలాంటి కల్తీ లేకుండా వస్తుంది. అంటే టెంకాయ నీరు చాలా పవిత్రమైనది. టెంకాయ పై భాగం చాలా గట్టిగా ఉంటుంది

దాని పగుల కొడితే టెంకాయ లోపల తెల్లటి కొబ్బరి అలాగే పవిత్రమైన కొబ్బరి నీరు ఉంటుంది. మనుషులు కూడా ఎంత అహాన్ని కలిగి ఉన్న దానిని దేవుడి ముందు తొలగించుకొని పవిత్రంగా ఉంటే మన మనసు కూడా కొబ్బరి నీళ్లలాగా చాలా పవిత్రంగా తయారు అవుతుందని మన పెద్దలు చెపుతున్నారు. మన మనసు పవిత్రంగా ఉంటే మనం ఏ పని చేసిన అది కచ్చితంగా జరుగుతుంది అని ఇక మనకు తెలిసిందే కదా!. అందుకే భాగంతుని ముందు కొబ్బరికాయను కొట్టి మనలో అహాన్ని తొలగించుకుంటాం.